News August 7, 2024

ఆ స్థానాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ!

image

UP: అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను BJP ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్‌స‌భ స్థానంలో ఓట‌మితో బీజేపీ తీవ్ర ప‌రాభ‌వాన్ని ఎదుర్కొంది. ఇక్క‌డ గెలిచిన ఎస్పీ అభ్య‌ర్థి అవ‌ధేశ్ ప్ర‌సాద్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఉపఎన్నిక అనివార్య‌మైంది. ఇక్క‌డ పార్టీ గెలుపు కోసం సీఎం యోగి స్థానిక నేతలతో స‌మావేశ‌మ‌య్యారు.

Similar News

News January 22, 2026

AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

image

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో AIపై నిర్వహించిన సెషన్‌లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్‌పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్‌లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

News January 22, 2026

ట్రంప్‌కు EU కౌంటర్.. ట్రేడ్ డీల్ ఫ్రీజ్

image

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలన్న US అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరికి EU కౌంటరిచ్చింది. యూరప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్స్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. USతో ట్రేడ్ డీల్‌కు ఆమోదం తెలపకుండా EU పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. డీల్‌లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటింగ్ జరపాల్సి ఉంది. కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.

News January 22, 2026

జనవరి 22: చరిత్రలో ఈ రోజు

image

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1885: ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
2014: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (ఫొటోలో)