News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్‌ను మరో కాలేజీకి ప్రిన్సిపల్‌గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News January 30, 2026
పార్టీలకు ఇచ్చే భూమి 50 సెంట్లకు పెంపు

AP: నియోజకవర్గ కేంద్రాల్లో రాజకీయ పార్టీలకు లీజుకు ఇచ్చే భూమి విషయంలో ప్రభుత్వం కీలక సవరణ చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇచ్చే భూమిని 30 సెంట్ల నుంచి 50 సెంట్లకు పెంచింది. ఈ భూమిని లీజుకు ఇచ్చినందుకు పార్టీల నుంచి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి జీవో 575లో పాయింట్ 1, 3లను సవరిస్తూ రెవెన్యూ శాఖ జీవో 62ను విడుదల చేసింది.
News January 30, 2026
నవగ్రహాలు – నవరత్నాలు: ఏ గ్రహానికి ఏ రత్నం?

ఆదిత్యుడు – కెంపు
చంద్రుడు – ముత్యం
అంగారకుడు – ఎర్రని పగడం
బుధుడు – పచ్చ
గురు – పుష్య రాగం
శుక్రుడు – వజ్రం
శని – నీలం
రాహువు – గోమేధుకం
కేతువు – వైడూర్యం
News January 30, 2026
రాజీకి ఏ విధానం అనుసరించారు: హైకోర్టు

AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని TTD EOను HC ఆదేశించింది. రాజీకి అథారిటీ ఎవరు? ఏ విధానం అనుసరించారు? టీటీడీ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని తెలిపింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై వచ్చిన అప్పీల్‌తో పాటు సుమోటో పిటిషన్‌ను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసును Feb 5కు వాయిదా వేసింది.


