News April 11, 2024

ప్రచారాన్ని చూసేందుకు 25 దేశాలకు బీజేపీ ఆహ్వానం

image

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రచార తీరును చూసేందుకు బీజేపీ 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. అందుకు జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి 13 దేశాల్లోని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో భారత్‌కు రానున్న ఆయా దేశాల పార్టీల ప్రతినిధులు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాలను చూడనున్నారు. అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో అక్కడి పార్టీలను బీజేపీ ఆహ్వానించలేదు.

Similar News

News November 15, 2024

గాడిద పాల పేరుతో ఘరానా మోసం

image

గాడిద పాల పేరుతో డాంకీ ప్యాలెస్ సంస్థ తెలంగాణ, AP, తమిళనాడు, కర్ణాటకలోని రైతులను ₹100 కోట్ల వరకూ మోసం చేసింది. ఒక్కో గాడిదను రూ.లక్షన్నరకు అమ్మిన సంస్థ లీటర్ పాలను ₹1600కు కొంటామని నమ్మించింది. తొలి 3 నెలలు నమ్మకంగా సేకరణ డబ్బులు చెల్లించి, గత 18 నెలలుగా పెండింగ్‌లో ఉంచింది. చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో AP, TG CMలు న్యాయం చేయాలని బాధితులు HYD ప్రెస్‌ క్లబ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

News November 15, 2024

అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చే చోటు.. పేరుమార్చిన కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ పేరును భగవాన్ బిర్సాముండా చౌక్‌గా మార్చింది. స్వతంత్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్యదైవం అయిన బిర్సాముండా 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా నగరంలోని ఇంటర్నేషనల్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఆవిష్కరించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బిర్సాముండా గిరిజనులతో సైనిక విప్లవం సృష్టించారు. ఆయన జయంతి రోజైన NOV 15ను కేంద్రం 2021లో జన జాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించింది.

News November 15, 2024

ప్ర‌ధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం

image

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌యాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తిన‌ట్టు తెలుస్తోంది. మోదీ శుక్రవారం ఝార్ఖండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో దేవ్‌ఘర్ విమానాశ్ర‌యంలో ఉన్న విమానంలో సమస్య తలెత్తినట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీనిపై PM Office స్పందించాల్సి ఉంది. మోదీ తిరుగు ప్ర‌యాణం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.