News March 24, 2024

జలగంకు బీజేపీ షాక్

image

TG: ఇటీవల BJPలో చేరిన జలగం వెంకటరావుకు షాక్ తగిలింది. ఖమ్మం నుంచి ఎంపీ సీటు ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. తాజా జాబితాలో ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు పేరును బీజేపీ ప్రకటించింది. టికెట్ ఆశించి బీజేపీలో చేరిన వెంకట్ రావు ముందు నుంచి ఖమ్మం స్థానం తనదేనని ధీమాతో ఉన్నారు. కొత్తగూడెంకు చెందిన వ్యాపారవేత్త వినోద్ రావుకు ఈ స్థానంలో టికెట్ ఇవ్వడంతో జలగం పరిస్థితి అయోమయంగా మారింది.

Similar News

News November 13, 2025

17న ఎమ్మెల్యేల అనర్హత సహా అన్ని పిటిషన్లపై విచారణ

image

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లన్నిటినీ సోమవారం (17వ తేదీ) విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు నిర్దేశించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు MLAలపై చర్యలు తీసుకోలేదంటూ BRS ఇటీవల స్పీకర్‌పై ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై నిర్ణయానికి మరో 2నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం అంతకు ముందే SCని కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని సుప్రీం తాజాగా స్పష్టం చేసింది.

News November 13, 2025

BOB క్యాపిటల్‌లో ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News November 13, 2025

నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగుస్తుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష తేదీలు తదితర వివరాలను త్వరలో వెల్లడించనుంది.