News September 11, 2025
టీడీపీ స్ర్కిప్ట్‌నే బీజేపీ ఫాలో అవుతోంది: పేర్ని నాని

AP: హిందూ మతం ముసుగులో YCPపై బీజేపీ నేతలు మాధవ్, పురందీశ్వరి విషం చిమ్ముతున్నారని పేర్ని నాని ఫైరయ్యారు. టీడీపీ స్క్రిప్ట్‌ను BJP నేతలు కాపీ పేస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దీని బదులు పవన్‌లాగా పార్టీని చంద్రబాబుకు అద్దెకు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అంతర్వేది రథం ధ్వంసంపై తాము ఆనాడే సీబీఐ విచారణ కోరినట్లు తెలిపారు. TDP, బీజేపీ కలిసి ఉన్నప్పుడే APలో అత్యధికంగా ఆలయాలు ధ్వంసమయ్యాయన్నారు.
Similar News
News September 12, 2025
సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం (ఫొటోలో లెఫ్ట్)
1967: నటి అమల అక్కినేని జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (ఫొటోలో రైట్)
2009: BCCI మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
2024: తెలుగు గీత రచయిత గురుచరణ్ మరణం
News September 12, 2025
డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <
News September 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 12, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
✒ ఇష: రాత్రి 7.33 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.