News November 23, 2024
ఆ ఒక్క స్థానంలోనూ వెనుకబడ్డ బీజేపీ

పాలక్కడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు దిశగా పయనించిన బీజేపీ అభ్యర్థి కృష్ణకుమార్ తదుపరి రౌండ్లలో వెనుకబడ్డారు. ఇక్కడ యూడీఎఫ్ అభ్యర్థి రాహుల్ 18,724 ఓట్ల ముందంజలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో త్రిసూర్ లోక్సభ స్థానంలో విజయం సాధించి కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ తాజాగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్న ఆశలు సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. చెలక్కరలో బీజేపీ మూడో స్థానంలో ఉంది.
Similar News
News November 27, 2025
నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు

1888: లోక్సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం
News November 27, 2025
టీమ్ఇండియా ఓటమిపై గిల్ రియాక్షన్

SAతో హోమ్ టెస్ట్ సిరీస్లో టీమ్ఇండియా వైట్వాష్ కావడంతో వస్తున్న విమర్శలపై కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదటిసారి స్పందించారు. “ప్రశాంత సముద్రాలు ఎలా ముందుకు సాగాలో నేర్పించవు.. తుఫాన్లే బలమైన చేతులను తయారు చేస్తాయి. మేమంతా ఒకరినొకరం నమ్ముకుని ముందుకు సాగుతాం” అని SMలో పోస్ట్ చేశారు. గాయం కారణంగా గిల్ రెండో టెస్ట్తో పాటు SAతో ODI సిరీస్కు సైతం దూరమైన విషయం తెలిసిందే.
News November 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


