News August 25, 2025
BJP అబద్ధాలాడుతోంది: మంత్రి తుమ్మల

TG: రాష్ట్రానికి యూరియా తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడతామని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. ‘యూరియా సరఫరాలో కేంద్రం విఫలమైంది. RFCLలో ఉత్పత్తి నిలిచిపోవడంతో యూరియా రాలేదు. కేంద్ర వైఫల్యాన్ని రాష్ట్రంపై నెట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కొరత ఉంటే కేవలం TGలోనే ఉన్నట్లు BJP అబద్ధాలాడుతోంది. యూరియా కోసం రైతులు క్యూ కట్టారంటూ అసత్య ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.
Similar News
News August 26, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 26, 2025
మా పాలనలో దాదాపు 2 లక్షల టీచర్ల నియామకం: TDP

AP: డీఎస్సీకి పర్యాయపదంగా తమ పార్టీ మారిందని టీడీపీ ట్వీట్ చేసింది. TDP పాలనలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల టీచర్ల నియామకాలు చేసి చరిత్ర సృష్టించినట్లు Xలో పేర్కొంది. 1994లో 16,238 డీఎస్సీ ఉద్యోగాలతో మొదలైన ప్రస్థానం ఇంకా కొనసాగుతోందని తెలిపింది. లిమిటెడ్, స్పెషల్ రిక్రూట్‌మెంట్లతో కలపి 1,96,619 ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
News August 26, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 26, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.48 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.