News November 16, 2024
KTR అరెస్ట్‌ని బీజేపీ అడ్డుకోవడం లేదు: కిషన్ రెడ్డి

TG: KTR అరెస్ట్‌ని BJP అడ్డుకుంటోందన్న విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన KTR కేంద్ర మంత్రులెవరినీ కలవలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ఏ ఫైల్‌పై సంతకం పెడుతున్నారనేది కేంద్రం పర్యవేక్షించదని వెల్లడించారు. మాజీ సీఎం KCR తరహాలోనే CM రేవంత్ రెడ్డి కూడా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధపు, అరాచక పాలన కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి కథ అందిస్తున్న సందేశాలివే..

☞ భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
☞ అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
☞ సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞ కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.
News November 20, 2025
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
News November 20, 2025
హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.


