News February 24, 2025
కేసీఆర్, కేటీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది: సీఎం రేవంత్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌ను బీజేపీ కాపాడుతోందని సీఎం రేవంత్ ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదని బెదిరించడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని అన్నారు. ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడారు.
Similar News
News February 24, 2025
వికారాబాద్: 93ఎకరాల భూమి.. 62మందికి చెక్కులు

పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందించామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన రైతులకు నష్ట పరిహార చెక్కులను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. 93.16 ఎకరాల భూమికి 62 మంది రైతులకు నష్టపరిహారం అందించామన్నారు.
News February 24, 2025
ఏడాదిలో 300 రోజులు అదే తింటా: మోదీ

ఫూల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు అదే తింటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో మఖానా తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి’ అని పేర్కొన్నారు. కాగా బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు.
News February 24, 2025
ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా

AP: ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించారు. కాగా ఫైబర్‌నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం.