News April 14, 2025
BJP అంబేడ్కర్‌కు శత్రువు : మల్లికార్జున్ ఖర్గే

బీజేపీ, RSS భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు శత్రువులని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 1952 ఎన్నికల్లో ఆయన ఓటమికి V.Dసావర్కర్, SA డాంగే కారణమన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా ఓ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ SC, ST, OBCలకు రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపట్టాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
Similar News
News April 15, 2025
ఈ ఆహారం తినే పురుషులు జాగ్రత్త!

ప్రాసెస్డ్ & జంక్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్, పిజ్జాలు తినే పురుషుల్లో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల ప్రభావం వల్ల స్త్రీలలో ఈ రిస్క్ తక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న పురుషులు టెస్టులు చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. కాగా బ్రిటన్‌లోని పురుషులు, స్త్రీలపై 28ఏళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
News April 15, 2025
పంజాబ్‌పై వికెట్ల‘కింగ్’గా ఆవిర్భవించిన నరైన్!

ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ నరైన్ ఐపీఎల్ రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్‌లో ఆయన 2 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆ జట్టుపై ఆయన తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 36కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలరైనా ఓ ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీయడం ఇదే అత్యధికం.
News April 15, 2025
ALERT.. కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వీటితో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీచేసింది.