News August 27, 2024

29 మంది పేర్లతో బీజేపీ మూడో జాబితా

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 29 మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలకు 10 మంది అభ్యర్థులను, అక్టోబర్ 1న జరగనున్న మూడో విడత ఎన్నికల్లో పోటీ చేసే 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటిదాకా BJP మూడు జాబితాల ద్వారా 45 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. పదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BJP 25 స్థానాల్లో గెలిచింది.

Similar News

News December 23, 2025

రొమ్ము క్యాన్సర్‌కు నానో ఇంజెక్షన్

image

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు IIT మద్రాసు గుడ్ న్యూస్ చెప్పింది. AUS పరిశోధకులతో కలిసి ‘కట్టింగ్ ఎడ్జ్ నానో ఇంజెక్షన్ డ్రగ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్’ను డెవలప్ చేసింది. ఈ నానో ఇంజెక్షన్‌తో యాంటీ క్యాన్సర్ డ్రగ్ ‘డోక్సోరుబిసిన్’ను నేరుగా క్యాన్సర్ కణాల్లోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కీమోథెరపీ, రేడియేషన్ పద్ధతుల వల్ల క్యాన్సర్ కణాలతో సంబంధంలేని ఇతర భాగాలపై ప్రభావం పడుతోంది.

News December 23, 2025

వింటర్‌లో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

image

శీతాకాలంలో ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల గర్భిణులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చాలా చల్లగా ఉండే ఆహార పదార్థాలను తినడం మానుకోండి. తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. ఎప్పటికప్పుడు ప్రినేటల్ చెకప్‌లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 23, 2025

ట్రంప్ నోట మళ్లీ అదే మాట!

image

భారత్, PAK మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపినట్లు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. దీంతో 10మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను కాపాడినట్లు పాక్ PM చెప్పినట్లు వివరించారు. పహల్గామ్ దాడి తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 8 విమానాలు నేలకొరిగాయన్నారు. 8 యుద్ధాలు ఆపానని, తాను పరిష్కరించని ఏకైక యుద్ధం ఉక్రెయిన్-రష్యాదే అని తెలిపారు. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య విపరీతమైన ద్వేషం ఉందని చెప్పారు.