News December 20, 2024
ప్రజల దృష్టి మళ్లించడానికి BJP యత్నం: షర్మిల

AP: అంబేడ్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. గురువారం పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యల వీడియో డిలీట్ చేయాలంటూ ‘X’కు కేంద్రం నోటీసులివ్వడం చూస్తుంటే వారే తప్పు చేశారని అర్థమవుతోందన్నారు.
Similar News
News December 2, 2025
NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nsic.co.in
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
News December 2, 2025
IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


