News December 17, 2024

20 మంది పార్టీ ఎంపీల‌కు బీజేపీ నోటీసులు!

image

జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నుండడంతో పార్టీ ఎంపీల‌కు బీజేపీ సోమ‌వారం విప్ జారీ చేసింది. అయితే, మంగ‌ళ‌వారం స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డంపై జ‌రిగిన ఓటింగ్‌కు 20 మంది ఎంపీలు గైర్హాజ‌ర‌య్యారు. దీంతో విప్‌ను ధిక్క‌రించిన స‌భ్యులంద‌రికీ నోటీసులు ఇవ్వాల‌ని పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. కీల‌క స‌మ‌యంలో స‌భ‌కు రాక‌పోవ‌డంపై పార్టీ పెద్ద‌లు ఆగ్రహంగా ఉన్నట్టు స‌మాచారం.

Similar News

News October 26, 2025

ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపుల్లో స్వల్ప మార్పులు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బేస్‌మెంట్ వరకు రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు రూ.లక్ష, శ్లాబ్ వేశాక రూ.2 లక్షలు, చివర్లో రూ.లక్ష చొప్పున 4 విడతల్లో రూ.5 లక్షలిస్తున్నారు. ఇక నుంచి శ్లాబ్ వేశాక రూ.1.40 లక్షలే ఖాతాలో జమ అవుతాయని మంత్రి చెప్పారు. మిగతా రూ.60 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇస్తామన్నారు.

News October 26, 2025

తులసి మొక్క ఇంటికి ఏ దిశలో ఉండాలి?

image

ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘తులసి ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సూర్యునికి అభిముఖంగా, తూర్పు దిశలో ఉండటం శ్రేయస్కరం. ఉత్తరంలోనూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ఉదయం కొంత సమయం తులసి దగ్గర గడపాలి. ఈ మొక్క ఎదుగుదల ఇంట్లోవారికి కొన్ని సూచనలిస్తుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 26, 2025

కర్నూలు దుర్ఘటన.. చివరి నిమిషంలో బస్సెక్కి మృతి

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన 19వ వ్యక్తి చిత్తూరు(D)కు చెందిన త్రిమూర్తి అని తేలింది. ఆయన రిజర్వేషన్ లేకున్నా ఆరాంఘర్‌(HYD)లో బస్సెక్కారు. తన ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి DNA శాంపిల్స్ పరీక్షించగా చనిపోయింది త్రిమూర్తేనని తేలింది. TGకి చెందిన తరుణ్ రిజర్వేషన్ చేసుకున్నా చివరి నిమిషంలో బస్సెక్కకుండా ప్రాణాలు కాపాడుకోగా త్రిమూర్తిని మృత్యువు వెంటాడింది.