News August 16, 2024

బీజేపీ వాళ్లే విధ్వంసానికి పాల్పడ్డారు: CM మ‌మ‌త‌

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం కేసులో నిజం బ‌య‌ట‌కు రావాలని సీఎం మ‌మ‌త అన్నారు. అయితే, ఈ విష‌యంలో కొందరు అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రిలో జరిగిన విధ్వంసంతో విద్యార్థి సంఘాల‌కు సంబంధం లేద‌ని, ఇందులో బ‌య‌టి వ్య‌క్తుల ప్ర‌మేయం ఉంద‌న్నారు. జెండాలు చేత‌ప‌ట్టుకొని బీజేపీ, DYFIకి చెందిన వారే ఈ విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. 25 మందిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు.

Similar News

News October 21, 2025

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

AP: NTR జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/

News October 21, 2025

ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

image

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్‌చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.

News October 21, 2025

రబీకి అనువైన ఆరుతడి పంటలు – ప్రయోజనాలు

image

రబీలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమలు, ఆముదం, శనగ, పెసర, మినుము, బొబ్బర్లు, కొత్తిమీర, ఉల్లి, ఆలుగడ్డ, పచ్చిమిరప, పుచ్చకాయ, కూరగాయలను ఆరుతడి పంటలుగా పండించవచ్చు. వీటి వల్ల సాగు ఖర్చు, ఎరువుల వినియోగం, చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది. తక్కువ నీటితో అధిక దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. ఇవి 80-110 రోజులలో కోతకు వస్తాయి. అందుకే తక్కువ కాలంలో, తక్కువ నీటితో, ఎక్కువ ఆరుతడి పంటలు పండించవచ్చు.