News June 4, 2024

అయోధ్యలో బీజేపీ వెనుకంజ

image

అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాత ఆ సీటు బీజేపీకేనని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలు తలకిందులయ్యేలా అయోధ్య ప్రజలు ఓటేశారు. అక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ వెనుకంజలో ఉన్నారు. సింగ్ దాదాపు 600 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. ఈసీ లెక్కల ప్రకారం యూపీలో INDIA కూటమి 40 సీట్లలో ముందంజలో ఉంది.

Similar News

News October 7, 2024

కేంద్ర మంత్రులతో CM రేవంత్ భేటీ

image

ఢిల్లీలో ఉన్న CM రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌‌తో భేటీ అయ్యారు. మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహాకారం అందించాలని కోరారు. CSMPని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. HYDలో పురాత‌న మురుగుశుద్ధి వ్య‌వ‌స్థ‌ ఉంద‌ని, అది ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేద‌ని వివ‌రించారు.

News October 7, 2024

స‌మోసాలు, చిప్స్‌, కుకీలతో మధుమేహం!

image

స‌మోసాలు, చిప్స్‌, కుకీలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ మ‌ధుమేహానికి దారితీస్తున్నట్టు ICMR-MDRF ప‌రిశోధ‌న‌లో తేలింది. అధిక ఉష్ణోగ్ర‌త‌లో వండే ఈ ప‌దార్థాల్లో అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్(AGEs) అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, గ్లూకోజ్ గ్లైకేష‌న్ ద్వారా ఇది ఏర్ప‌డుతుంది. అధిక AGEs ప‌దార్థాలు టైప్2 డయాబెటిస్‌కు కారణమని వైద్యులు చెబుతున్నారు. వేయించిన ఆహారాన్ని తిన‌డం త‌గ్గించాలని సూచిస్తున్నారు.

News October 7, 2024

రూ.35,000 కోసం పెళ్లి చేసుకున్న అన్నాచెల్లెళ్లు!

image

ప్రభుత్వం అమలు చేస్తున్న సామూహిక వివాహ పథకం ప్రయోజనాలు (రూ.35,000) పొందడం కోసం అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్న ఘటన యూపీలో జరిగింది. ఈ ఏడాది మార్చి 5న ఈ ఘటన జరగగా, స్థానికుల సమాచారంతో అధికారులు తాజాగా చర్యలకు ఉపక్రమించారు. యువతికి ఇదివరకే వివాహం జరగగా, డబ్బుల కోసం మరోసారి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. వరుడు సమయానికి రాకపోవడంతో వధువు, ఆమె సోదరుడు పెళ్లి చేసుకున్నారు.