News May 11, 2024
ప్రజ్వల్ వ్యవహారం బయటపెట్టిన బీజేపీ నేత అరెస్ట్

సంచలనం రేపిన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారాన్ని బయటపెట్టిన బీజేపీ నేత దేవరాజే గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ స్థలాన్ని విక్రయించే విషయంలో గౌడ తనను లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా దేవరాజే గౌడ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో BJP తరఫున పోటీ చేసి ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ చేతిలో ఓడిపోయారు.
Similar News
News November 22, 2025
భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.
News November 22, 2025
ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


