News April 6, 2024
మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు: రేవంత్

TG: జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘BRSను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. బీజేపీని అలాగే ఓడించాలి. ఇదే పట్టుదలతో పని చేయాలి. గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది. మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మునిగినప్పుడు సిగ్గులేని కిషన్ రెడ్డి కేంద్రం నుంచి రూపాయి కూడా తేలేదు. అందుకే బీజేపీకి ఓటేయాలా?’ అని మండిపడ్డారు.
Similar News
News December 2, 2025
ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 2, 2025
iBOMMA రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్

iBOMMA రవిని పోలీసులు మరో 3 కేసుల్లో అరెస్టు చేశారు. మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ మూవీ పైరసీ పట్ల మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే జైల్లో ఉన్న అతడికి నాంపల్లి కోర్టు మరో 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
News December 2, 2025
సమంత పెళ్లి పోస్టు.. 16 గంటల్లో 79.5 లక్షల లైక్స్

దర్శకుడు రాజ్ నిడిమోరును హీరోయిన్ సమంత రెండో <<18438537>>వివాహం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్కు 16 గంటల వ్యవధిలోనే దాదాపు 79.5 లక్షల లైక్స్ రావడం గమనార్హం. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఈ జోడీకి విషెస్ చెబుతున్నారు. రాజ్ రూపొందించిన ఫ్యామిలీమ్యాన్-2 సమయంలో సమంతతో ప్రేమ మొదలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.


