News June 4, 2024

తూర్పు భారతంలో బీజేపీ లీడింగ్

image

ఒడిశా, బిహార్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఒడిశాలో 14 స్థానాల్లో బీజేపీ, 5 స్థానాల్లో బీజేడీ, ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు బిహార్‌లో ఎన్డీఏ కూటమి మెజార్టీలో కొనసాగుతోంది. ఝార్ఖండ్‌లోనూ 8 స్థానాల్లో NDA కూటమి ముందంజలో ఉంది.

Similar News

News January 27, 2026

AI మ్యాజిక్.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి చేసుకున్నట్లు ఉన్న AI ఫొటోలు వైరలవుతున్నాయి. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సమంత, శ్రీలీల, మృణాల్ వంటి స్టార్లు ఈ పెళ్లికి హాజరైనట్లు ఫొటోలో చూపించారు. విజయ్-రష్మిక నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలొస్తున్న తరుణంలో వీరి అభిమానులు ఈ AI ఫొటోలు చూసి ఖుషీ అవుతున్నారు.

News January 27, 2026

దేశాన్ని రాజుల యుగంలోకి నెట్టే ప్రయత్నం: రాహుల్ గాంధీ

image

ఉపాధి హామీ(MGNREGA) చట్టాన్ని కేంద్రం నాశనం చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘కార్మికుల హక్కులు, పంచాయతీలు, రాష్ట్రాల అధికారాలను హరించడం, దేశాన్ని రాజుల కాలంలోకి నెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. అలా అయితే పవర్, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది కదా. కనీస వేతనాలు, పనికి గ్యారంటీ, స్వేచ్ఛ, గౌరవంతో పని చేసే హక్కుతో MGNREGA తమ జీవితాలను మార్చిందని కార్మికులు అంటున్నారు.’ అని ట్వీట్ చేశారు.

News January 27, 2026

గ్రహ దోషాలను దూరం చేసే ‘నెమలి ఈక’

image

నెమలి ఈకకు ప్రతికూల శక్తిని తొలగించి శుభాలను కలిగించే శక్తి ఉంటుది. అలాగే గ్రహ దోష నివారణకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందట. వివిధ రంగుల దారాలతో నిర్దిష్ట సంఖ్యలో ఈకలను కట్టి పూజిస్తే మంచి ఫలితాలుంటాయట. ‘రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి శనివారం 2 ఈకలను పూజించాలి. దిండు కింద పెట్టుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. దేవుడి గదిలో వీటిని ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి’ అని జ్యోతిషులు సూచిస్తున్నారు.