News April 3, 2024

ఢిల్లీ మంత్రి ఆతిశీకి BJP లీగల్ నోటీస్

image

ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీకి బీజేపీ లీగల్ నోటీస్ పంపించింది. తనను పార్టీలో చేరాలని లేదంటే అరెస్టుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ బెదిరించినట్టు ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ ఆమెకు పరువునష్టం దావా నోటీస్ పంపింది. తమ పార్టీ తరఫున ఆమెను ఎవరు సంప్రదించారో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ CM కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఆతిశీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News October 7, 2024

పండుగల నేపథ్యంలో ఉగ్రదాడులకు ప్లాన్!

image

దసరా, దీపావళి సందర్భంగా దేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నిఘావర్గాలు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా విదేశీయులే లక్ష్యంగా రాయబార కార్యాలయాల వద్ద ఈ దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

News October 7, 2024

రుణమాఫీ: మోదీకి మంత్రి తుమ్మల ఎదురు ప్రశ్న

image

తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పందించారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి, ప్రధాని మోదీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ఎదురు ప్రశ్న సంధించారు. మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నామని, వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని గాంధీ భవన్‌లో అన్నారు.

News October 7, 2024

మాది మనసున్న మంచి ప్రభుత్వం: మంత్రి లోకేశ్

image

AP: అన్ని వర్గాల క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేశ్ చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఇప్పుడు వాటికి సాయం ₹10వేలకు పెంచామని పేర్కొన్నారు. దీనివల్ల 5,400 ఆలయాల్లో ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడిందన్నారు.