News April 7, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Similar News
News November 8, 2025
గుండెల్లో మంటా?.. నిర్లక్ష్యం చేయొద్దు!

మసాలా ఫుడ్ తిన్న తర్వాత పలువురు గుండెల్లో మంటతో ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా ఒకసారి గుండెల్లో మంట వస్తే ఫర్వాలేదు. కానీ తరచూ అదే సమస్య ఎదురైతే చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే అన్నవాహిక సమస్య ఏర్పడుతుందని, కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత అన్నవాహిక స్పింక్టర్ మూసుకోకపోవడం వల్లే గుండెల్లో మంట వస్తుందని వివరించారు.
News November 8, 2025
లాలూ 7 జన్మలెత్తినా మోదీ కాలేరు: అమిత్ షా

ఏడు జన్మలెత్తినా లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ కుంభకోణాలు చేయలేరని కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. రైల్వేకు లాలూ తీసుకొచ్చిన లాభాలను మోదీ ఎన్నటికీ తీసుకురాలేరన్న తేజస్వీ యాదవ్ కామెంట్లకు షా కౌంటరిచ్చారు. బిహార్‌లోని పూర్ణియాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అక్రమ వలసదారులను గుర్తిస్తామని, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి దేశం నుంచి పంపిస్తామని చెప్పారు.
News November 8, 2025
రేపటి నుంచి మద్యం షాపులు బంద్: CP

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14న కౌంటింగ్ సందర్భంగా ఉ.6 నుంచి 15న ఉ.6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్నారు.


