News June 16, 2024

కాంగ్రెస్‌ చీఫ్‌ను కలిసిన బీజేపీ మంత్రి

image

బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఇంటికి వెళ్లి కలిశారు. ఇదిలా ఉంటే ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో భాగంగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. జూలై 22న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Similar News

News September 14, 2025

తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు!

image

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై ల్యాబ్‌లో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రాన్షియం అనే ఎలిమెంట్‌, ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నీటిని తాగడం వల్లే స్థానికులు అనారోగ్యం బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవల తురకపాలెంలో అనారోగ్యంతో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.

News September 14, 2025

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

image

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT

News September 14, 2025

BELలో ఇంజినీర్ పోస్టులు

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 67 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంటెక్/ఎంఈ , ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.