News June 16, 2024

BJP ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

image

TG: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుంచి వస్తున్న ఆయనను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ అల్లర్ల దృష్ట్యా రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. రేపు మెదక్ వెళ్తానని ఆయన ఇప్పటికే ప్రకటించడంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News January 4, 2025

CM సొంతూరులోనే రుణమాఫీ జరగలేదు: KTR

image

TG: రాష్ట్రంలో రూ.2లక్షల రుణమాఫీ సరిగా అమలు చేయట్లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. CM రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లెలోనూ రుణమాఫీ అందరికీ అందలేదన్నారు. రైతులు ప్రమాణపత్రాలు రాయడం ఏంటి? అని ప్రశ్నించారు. KCR ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.లక్ష 7వేల కోట్లు జమ చేసిందన్నారు. రైతుబంధులో రూ.22వేల కోట్లు దారి మళ్లాయని, రైతులను దొంగలుగా చిత్రీకరించేలా అసెంబ్లీలో CM మాట్లాడారని మండిపడ్డారు.

News January 4, 2025

అప్పుడే మోదీ విశాఖలో అడుగుపెట్టాలి: షర్మిల

image

AP: విశాఖ ఉక్కుతో కేంద్రం చెలగాటం ఆడుతూనే ఉందని, ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. 8న విశాఖ వస్తున్న PM మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమకు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్లాంట్ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించాకే మోదీ విశాఖలో అడుగుపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.

News January 4, 2025

SBI నుంచి 2 కొత్త డిపాజిట్ స్కీమ్‌లు

image

SBI రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. హర్ ఘర్ లఖ్‌పతీ స్కీమ్‌లో రూ.లక్ష చొప్పున(రూ.లక్ష మల్టిపుల్స్) పోగేసుకోవచ్చని SBI తెలిపింది. ఈ ప్రీకాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ కనీస కాలవ్యవధి 12నెలలు కాగా, గరిష్ఠ వ్యవధి 120 నెలలు. అటు, 80ఏళ్ల పైబడిన వారి కోసం తీసుకొచ్చిన SBI ప్యాట్రన్స్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ కంటే 10బేస్ పాయింట్లు అదనంగా చెల్లించనున్నట్లు వెల్లడించింది.