News June 6, 2024
రాహుల్కు బీజేపీ ఎంపీ కౌంటర్

మోదీ, షా స్టాక్ మార్కెట్ల స్కాంకు పాల్పడ్డారన్న రాహుల్ <<13392703>>వ్యాఖ్యల<<>>కు బీజేపీ ఎంపీ పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే భయంతో స్టాక్ మార్కెట్ పడిపోయిందని అన్నారు. తిరిగి మోదీ ప్రభుత్వమే రావడంతో కుదురుకుంటోందని చెప్పారు. మరోవైపు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మహిళకు రూ.లక్ష ఇస్తామనే హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News September 18, 2025
రాబోయే 3 గంటల్లో వర్షం: APSDMA

రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వాన కురుస్తుందని తెలిపింది. అటు TGలో HYD, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, MBNR, NLG, కామారెడ్డి, మెదక్, NRPT జిల్లాల్లో ఇవాళ రాత్రి వర్షం పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News September 18, 2025
సర్కారు బడుల్లో నర్సరీ, LKG, UKG.. ప్రభుత్వానికి సిఫార్సు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల వయసును ఆరేళ్లకు (ప్రస్తుతం 5 ఏళ్లు) పెంచాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సర్కారు బడుల్లోనూ నర్సరీ, LKG, UKGని ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రైవేట్ పాఠశాలల్లో మూడేళ్ల నుంచే పిల్లలను చేర్చుకుంటున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ఇష్టపడటం లేదని కమిషన్ గుర్తించి ఈ సిఫార్సులు చేసింది.
News September 18, 2025
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.