News June 23, 2024
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రియల్ ఫైటర్ కావాలి.. స్ట్రీట్ ఫైటర్ కాదు: ఈటల

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుకుంటున్న ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర చీఫ్‌గా ఫైటర్ కావాలంటున్నారు. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటరా? రియల్ ఫైటరా? ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడా. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి. వీధుల్లో పోరాడేవారు కాదు’ అని పేర్కొన్నారు. కాగా అధ్యక్ష రేసులో రాజా సింగ్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 17, 2025
షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.

1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

TG: 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును మెడికల్&హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 24,045 మంది దరఖాస్తు చేయగా, 23,323 మంది పరీక్ష రాశారు. కాగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టును సెపరేట్‌గా రిలీజ్ చేస్తామని MHSRB వెల్లడించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తుదారులు లేకపోవడంతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఫలితాల కోసం <