News January 30, 2025

యమునలో BJP విషం: కేజ్రీవాల్‌‌కు EC మరో షాక్

image

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందన్న ఆరోపణపై సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ఆయన <<15305182>>వివరణను<<>> తోసిపుచ్చింది. ఆధారాలు, వాస్తవాలు కాకుండా సాధారణ వివరణ ఇచ్చారని వెల్లడించింది. స్పష్టత ఇవ్వకుండా జస్టిఫై చేస్తున్నారని పేర్కొంది. శుక్రవారం 11AM లోపు మళ్లీ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వేర్వేరు అంశాలను కలపొద్దని సూచించింది.

Similar News

News October 13, 2025

చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను: మంత్రి పొంగులేటి

image

TG: మంత్రి కొండా సురేఖతో <<17994511>>విభేదాలంటూ<<>> జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ‘చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను. నాపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదు. ఈరోజు పర్యటనకు ఆమె రాకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలేవీ లేవు. అందరూ అన్ని సార్లు ఉండాలనేం లేదు. వచ్చే పర్యటనలో అక్కలు అందరూ ఉంటారు’ అని మేడారం పర్యటనలో వ్యాఖ్యానించారు.

News October 13, 2025

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు: సీఎం రేవంత్

image

TG: సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తేవాలి. భోజనం క్వాలిటీ చెక్‌ చేసేందుకు టెక్నాలజీ వాడాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలి. హాస్టళ్లను మెడికల్ కాలేజీలు, CHCతో లింక్ చేయాలి’ అని సూచించారు.

News October 13, 2025

పాక్‌లో ఆగని అల్లర్లు

image

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా TLP చేపట్టిన ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతూనే ఉంది. లాహోర్‌లో పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో మరణించగా నేడు కూడా ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్లపై అడ్డంగా పెట్టిన షిప్పింగ్ కంటైనర్లను తొలగించబోయారు. దీన్ని అడ్డుకున్న పోలీసులపై వారు కాల్పులు జరిపినట్లు పంజాబ్ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. తాజా ఘర్షణల్లో పోలీసు అధికారితో సహ ఐదుగురు మరణించారు.