News March 23, 2024
బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యావ్యవస్థపై దాడి చేస్తున్నాయి: కోదండరామ్

TG: గుజరాత్ నేరస్థులను అందలం ఎక్కిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యావ్యవస్థపై దాడి చేస్తూ అశాస్త్రీయ విషయాలను అందులో చొప్పిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.
Similar News
News December 23, 2025
లిక్కర్ కిక్కు.. దక్షిణాదిలో తెలంగాణ టాప్!

దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. సగటున తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక(4.25L), తమిళనాడు(3.38L), AP(2.71L), కేరళ (2.53L) ఉన్నాయి. యావరేజ్‌గా తెలంగాణలో మద్యం తాగేందుకు తలసరి ఖర్చు ₹11,351 కాగా, APలో ₹6,399 వెచ్చిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఏడాదిలో అమ్ముడైన మొత్తం మద్యం, జనాభా ఆధారంగా తలసరి వినియోగాన్ని అంచనా వేస్తారు.
News December 23, 2025
ఆయిల్‌పామ్.. అంతర పంటలతో అదనపు ఆదాయం

ఆయిల్‌పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. కోకో, కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస, మొక్కజొన్న వంటి అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
News December 23, 2025
GAIL(INDIA)లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


