News October 10, 2025

BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్

image

హరియాణాలో IPS ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ BJP-RSSను విమర్శించారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్‌కు ఇది నిదర్శనం. కులం పేరిట IPS అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. BJP-RSSల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.

Similar News

News October 10, 2025

నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్.. ఎవరీ మరియా..

image

వెనిజులాకు చెందిన మరియా కొరినా <<17966688>>మచాడోను<<>> నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. 1967 OCT 7న జన్మించిన మరియా 2002లో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ప్రతిపక్ష పార్టీ ‘వెంటె వెనెజులా’కు నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. 2018లో BBC 100 ఉమెన్, టైమ్ మ్యాగజైన్ వరల్డ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో నిలిచారు. దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం నిషేధం విధించింది.

News October 10, 2025

నెలసరి సెలవు.. మన దగ్గరా ఉండాలంటూ పోస్టులు!

image

కర్ణాటక ప్రభుత్వం నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందిని గుర్తించి నెలకు ఒకరోజు చొప్పున ఏడాదికి 12 రోజులు పెయిడ్ లీవ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. రుతుక్రమంలో తొలిరోజు లేచి నడిచేందుకూ తాము ఇబ్బంది పడతామని, దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు దీన్ని అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని CMలకు కోరుతున్నారు. మీ కామెంట్?

News October 10, 2025

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌ జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. ఢిల్లీ NCR, మహారాష్ట్రలో ఉద్యోగాలున్నాయి. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruit.southindianbank.bank.in/