News October 15, 2024

BJP, RSS ప్రొఫెసర్ సాయిబాబాను వేధించాయి: దిగ్విజయ్ సింగ్

image

ప్రొఫెసర్ సాయిబాబా మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘దివ్యాంగుడైన DU ప్రొఫెసర్‌ను BJP, RSS తప్పుడు ఆరోపణలతో జైలుకి పంపి వేధించాయి. అర్బన్ నక్సల్ అంటూ కేసు పెట్టి పదేళ్లు జైల్లో ఉంచారు. చివరకు హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇప్పటికైనా ఆయన సర్వీసులో వచ్చే జీతం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని అమిత్ షాకు ఫోన్ చేసి అభ్యర్థించా’ అని తెలిపారు.

Similar News

News December 18, 2025

పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కాకినాడలోని రంగ రాయ మెడికల్ కాలేజీలో 34 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు DEC 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, DCLT, BSc న్యూరో ఫిజియాలజీ, న్యూరో టెక్నాలజీ, BSc డయాలసిస్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, BSc ఇమేజింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణతతో పాటు డ్రైవర్ పోస్టులకు టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. https://rmckakinada.com/

News December 18, 2025

311 పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్వేలో 311 ఉద్యోగాల భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, జూ.ట్రాన్స్‌లేటర్, స్టాఫ్&వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ తదితర ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, PG(హిందీ&ఇంగ్లిష్), డిగ్రీ పాసై, వయసు 18-40 ఏళ్లు ఉండాలి. DEC 30 నుంచి JAN 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
వెబ్‌సైట్: rrbcdg.gov.in/

News December 18, 2025

తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు ఎందుకు?

image

సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారే జరుగుతాయి. అయితే ప్రతి మూడేళ్లకోసారి చాంద్రమానం ప్రకారం అధికమాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అదనంగా నిర్వహిస్తారు. ఆ వెంటనే దసరా నవరాత్రుల్లో, ఆశ్వయుజ మాసంలో రెండోసారి ఉత్సవాలు చేస్తారు. అయితే, రెండో ఉత్సవంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వేడుకలు ఉండవు. <<-se>>#VINAROBHAGYAMU<<>>