News July 11, 2024
బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ముద్ర

బడ్జెట్ సమావేశాల చరిత్రలో బీజేపీ సర్కార్ తనదైన ముద్రవేసింది. సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టే బ్రిటిష్ సంప్రదాయానికి 1999లో వాజ్‌పేయీ సర్కార్ చెక్ పెట్టింది. ఉదయం 11గం.కు సమావేశాలు మొదలయ్యేలా చేసింది. 2019లో సూట్‌కేసులో బడ్జెట్ తెచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టిన బీజేపీ సర్కార్ 2021లో డిజిటల్ బడ్జెట్‌కు నాంది పలికింది. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాలూ (రెండున్నర గంటలపైనే) బీజేపీ హయాంలోనే నమోదయ్యాయి.
Similar News
News November 27, 2025
వారి కూతుళ్లపై కామెంట్స్.. IASకు నోటీసులు

బ్రాహ్మణుల కూతుళ్లపై <<18384712>>వివాదాస్పద<<>> కామెంట్లు చేసిన ఐఏఎస్ సంతోశ్ వర్మకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చింది. IAS అధికారుల గౌరవం, ప్రవర్తనకు విరుద్ధంగా ఆయన కామెంట్లు ఉన్నాయని పేర్కొంది. ‘సంతోశ్ చర్యలు ఏకపక్షం, తీవ్రమైన దుష్ప్రవర్తన కిందికి వస్తాయి. ఆయన IAS రూల్స్(కండక్ట్)-1967ను ఉల్లంఘించారు. సంతోశ్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణాచర్యలను ఎదుర్కోవాల్సిందే’ అని స్పష్టం చేసింది.
News November 27, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* కిస్మిస్ నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే నెలల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలవు.
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. నామినేషన్లు ప్రారంభం

TG: గ్రామాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎల్లుండి వరకు కొనసాగనుంది. తొలి విడతలో 4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.


