News March 25, 2024
రఘురామకు బీజేపీ షాక్.. టీడీపీలో చేరతారా?

AP: YCP రెబల్ MP రఘురామకృష్ణరాజుకు BJP షాక్ ఇచ్చింది. నరసాపురం టికెట్ కూటమిలోని ఏ పార్టీకి దక్కినా.. తానే పోటీ చేస్తానంటూ పలుమార్లు చెప్పుకున్న ఆయనకు <<12919849>>నిరాశ<<>> ఎదురైంది. ఆ స్థానాన్ని శ్రీనివాసవర్మకు BJP కేటాయించింది. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా? లేక ఇండిపెండెంట్‌గా పోటీలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. విజయనగరం ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది.
Similar News
News October 17, 2025
ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండప్

➤ రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఉద్యోగుల సమస్యలపై చర్చ
➤ కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మార్చిన ప్రభుత్వం
➤ పిఠాపురం వర్మను జీరో చేశామని నేననలేదు. నా మాటలను వక్రీకరించారు: మంత్రి నారాయణ
➤ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ OCT 24కు పొడిగింపు
➤ న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతి జారీ చేసిన ఏసీబీ కోర్టు
News October 17, 2025
కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు: CM

TG: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో తీర్చిదిద్దాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. స్కూళ్లలో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ‘తొలి దశలో ORR లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి పెట్టండి. సరైన సౌకర్యాలు లేని స్కూళ్లను దగ్గర్లోని ప్రభుత్వ స్థలాలకు తరలించండి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి’ అని సూచించారు.
News October 17, 2025
ఫిట్‌మ్యాన్‌లా మారిన హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్తో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్నారు. తాజా ఫొటో షూట్లో రోహిత్ సన్నగా కనబడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫొటో షూట్లో లావుగా ఉన్న రోహిత్.. వర్కౌట్స్ చేసి సన్నబడ్డారు. గతంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్.. మళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.