News May 21, 2024
ఎంపీ జయంత్ సిన్హాకు బీజేపీ షోకాజ్ నోటీసులు

కేంద్ర మాజీ మంత్రి, BJP MP జయంత్ సిన్హాకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యవహారాలు, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించింది. కాగా ఝార్ఖండ్ హజారీబాగ్ ఎంపీ అభ్యర్థిత్వం తనకు దక్కనప్పటి నుంచి జయంత్ సిన్హా పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News December 10, 2025
NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.
News December 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్వర్క్ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్డ్ స్కిల్స్పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు


