News August 6, 2024
నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీ

TG: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరగనుంది. భవిష్యత్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమయ్యేలా కార్యచరణను రూపొందించడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు యువత, నిరుద్యోగ, రైతు, మహిళా సమస్యలపై ప్రత్యేక చర్చ చేపట్టే అవకాశముంది. గత ఎన్నికల వైఫల్యాలను రిపీట్ కానివ్వకుండా దిద్దుబాటు చర్యలకు భేటీలో నేతలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
Similar News
News January 15, 2026
సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో అప్రెంటిస్ పోస్టులు

ఢిల్లీలోని DRDOకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో 33 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc/BE/BTech/Diploma/ITI/BA/B.Com అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News January 15, 2026
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.
News January 15, 2026
OTD: టీమ్ ఇండియా ఘన విజయం

సరిగ్గా ఇదే తేదిన మూడేళ్ల క్రితం శ్రీలంకపై టీమ్ ఇండియా అద్భుతమైన విజయం నమోదు చేసింది. గిల్(116), కోహ్లీ(166*) సెంచరీల విధ్వంసం చేయగా భారత్ 50 ఓవర్లలో 390/5 స్కోరు చేసింది. ఛేదనలో సిరాజ్ 4, షమీ, కుల్దీప్ చెరో 2 వికెట్లతో చెలరేగడంతో SL 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో 317 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతమైంది. పరుగులు పరంగా ODIల్లో భారత్కు ఇదే భారీ విజయం. ఈ మ్యాచులో కోహ్లీ POTMగా నిలిచారు.


