News March 27, 2024

మరో సీటుకు పట్టుబడుతున్న బీజేపీ?

image

AP: పొత్తులో భాగంగా రాష్ట్రంలో పది అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న బీజేపీ, అనపర్తి సీటుకు బదులు రాజమండ్రి రూరల్ లేదా అర్బన్‌ సీట్లలో ఒకటివ్వాలని కోరుతున్నట్లు సమాచారం. పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును అక్కడి నుంచి పోటీకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్‌కు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్‌కు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని టీడీపీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Similar News

News March 24, 2026

KCR నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే: రేవంత్

image

కేసీఆర్‌తో తనకు వ్యక్తిగత సమస్యలు లేవని, ఆయన రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని TG సీఎం రేవంత్ TV9 సమ్మిట్‌లో తెలిపారు. కేసీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని విమర్శించారు. హరీశ్ రావు సీఎం అవుతా అన్నారని, వారసత్వ రాజకీయాల కోసం ఆ ఫ్యామిలీ పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్నదే తన లక్ష్యమని, BRS, BJP కలిసి వస్తే ఇద్దరినీ ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News March 24, 2026

ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

రాబోయే 2-3 గంటల్లో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, HYD, BHPL, KNR, ASF, MBNR, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాగా ఇప్పటికే HYDలో వర్షం కొనసాగుతోంది. అటు ఏపీలో రేపు అల్లూరి, పోలవరం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది.

News March 24, 2026

డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి: రేవంత్

image

TG: దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని BJP అనుకుంటోందని CM రేవంత్ ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TV9 సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఏ లెక్క ప్రకారం 50% సీట్ల పెంపు ఉంటుంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికే నష్టం. సీట్ల పెంపుపై చర్చ జరగాలి. 50% పెంపులోనే కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.