News March 28, 2024
గూగుల్, యూట్యూబ్ ప్రకటనల్లో BJP టాప్

TG: రాష్ట్రంలో గూగుల్, యూట్యూబ్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వడంలో BJP టాప్లో ఉంది. FEB 1 నుంచి MAR 27 వరకు రూ.12కోట్లు ఖర్చు చేసిందని పొలిటికల్ అడ్వర్టయిజింగ్ ట్రాన్స్పరెన్సీ రిపోర్టులో గూగుల్ తెలిపింది. మొత్తంగా 11,613 యాడ్స్ ఇచ్చినట్లు పేర్కొంది. అన్ని పార్టీలు కలిపి రూ.30.2కోట్లు ఖర్చు చేశాయని వెల్లడించింది. వీడియోల రూపంలో రూ.24.4కోట్లు, ఫొటోల రూపంలో రూ.5.7కోట్లు వెచ్చించాయని తెలిపింది.
Similar News
News December 10, 2025
విశాఖ: యువతితో సహజీవనం.. కుర్చీతో కొట్టి చంపిన వ్యక్తి అరెస్టు

పెందుర్తి పీఎస్ పరిధిలోని సుజాతనగర్లో యువతితో సహజీవనం చేస్తూ తగాదా పడి కుర్చీతో <<18498127>>కొట్టి చంపి పరారైన వ్యక్తిని<<>> పోలీసులు గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ 6 నెలలుగా సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. డబ్బుల కోసం దేవీతో గొడవపడి చంపాడు. కాగా రైస్ పుల్లింగ్ వంటి పలు నేరాల్లో శ్రీనివాస్పై ఇప్పటికే కేసులున్నాయి.
News December 10, 2025
మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్స్కీ

ఉక్రెయిన్లో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే మిత్రదేశాల నుంచి భద్రత, సహకారం అవసరమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షం కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.
News December 10, 2025
దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.


