News April 16, 2025
కాంగ్రెస్ ఎదుగుదలను BJP జీర్ణించుకోలేకపోతోంది: షర్మిల

BJPకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ‘దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను BJP జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తోంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేయడాన్ని, సోనియా, రాహుల్ గాంధీపై ED ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. “మనీ”నే లేని కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపించడం అత్యంత దారుణం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.