News October 12, 2025
రెప్పపాటులో బీజేపీ పని పూర్తి చేస్తుంది: ఒవైసీ

BJP బలమైన రాజకీయ ప్రత్యర్థి అని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రోజుకు 24 గంటలూ పని చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలని, రెప్పపాటులో BJP తన పని పూర్తిచేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓట్ చోరీ ఆరోపణలను తోసిపుచ్చారు. 2009, 2014లోనే తన సెగ్మెంట్‌లో ఓటర్ లిస్టులో డూప్లికెట్ ఎంట్రీలను గుర్తించి, సవాల్ చేశానని చెప్పారు. ఓటర్ లిస్టు, పేర్లను పార్టీలు కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు.
Similar News
News October 12, 2025
రాష్ట్ర బంద్ వాయిదా: BC JAC

TG: రిజర్వేషన్ల సాధన కోసం బీసీ నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ అక్టోబర్ 14 నుంచి 18వ తేదీకి వేశారు. రిజర్వేషన్ల కోసం ఇవాళ పలు బీసీ సంఘాలు ఒక్కటై BC JACగా ఏర్పడ్డాయి. ఆ జేఏసీ ఛైర్మెన్‌గా ఆర్.కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్ నారగొని తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చర్చలు జరిపి బంద్‌ను వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
News October 12, 2025
అది టెక్నికల్ ఎర్రర్: అఫ్గాన్ మంత్రి

మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు అనుమతివ్వకపోవడంపై అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ క్లారిటీ ఇచ్చారు. అది కావాలని చేసింది కాదని, టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగిందని తెలిపారు. భారత మీడియా, పొలిటీషియన్స్ నుంచి విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. ఇందులో వివక్ష లేదని, కొద్ది మంది జర్నలిస్టులకే ఆహ్వానం పంపడంతో ఇలా జరిగిందన్నారు. కాగా ఇవాళ్టి ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం గమనార్హం.
News October 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 33 సమాధానాలు

1. రామాయణాన్ని విభజించే ముఖ్య భాగాలను ‘కాండము’ అని పిలుస్తారు.
2. సంస్కృత మహాభారతంలో 100 ఉప పర్వాలు ఉన్నాయి.
3. వేద వ్యాసుడి తండ్రి పరాశరుడు.
4. నేపాల్‌లో జరిపే తిహార్ పండుగలో శునకాన్ని సత్కరిస్తారు.
5. ‘క్షీరం’ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘పాలు’.
<<-se>>#Ithihasaluquiz<<>>