News October 3, 2024
హరియాణాలో బీజేపీదే గెలుపు: మోదీ

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన Xలో ట్వీట్ చేశారు. దేశభక్తి గల ప్రజలు కాంగ్రెస్ విభజన, ప్రతికూల రాజకీయాలను ఎన్నటికీ అంగీకరించబోరని అన్నారు. ప్రజల మద్దతు, ఉత్సాహాన్ని చూస్తుంటే హరియాణా ప్రజలు తిరిగి బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.
Similar News
News January 15, 2026
ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 17న కాకినాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. మరోవైపు సంక్రాంతి నేపథ్యంలో నారావారిపల్లెలో ఉన్న ఆయన క్లస్టర్ యూనిట్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఆదాయం వచ్చేలా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఇంటర్నెట్, క్యాబిన్లు, క్యాంటిన్ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు.
News January 15, 2026
ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
News January 15, 2026
173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


