News January 30, 2025

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం

image

కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌నకు షాక్ తగిలింది. ఆప్ అభ్యర్థి ప్రేమ్ లతపై బీజేపీ అభ్యర్థి హర్‌ప్రీత్ కౌర్ బబ్లా గెలిచారు. కాషాయ పార్టీకి 19 ఓట్లు రాగా, ఆప్‌కి 17 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు బబ్లాను మేయర్‌గా ప్రకటించారు. ఈ ఎన్నికలు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్ పర్యవేక్షణలో జరిగాయి. కాగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం.

Similar News

News December 4, 2025

త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాహుల్ గాంధీ!

image

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

News December 4, 2025

32వేల మంది టీచర్లకు ఊరట

image

పశ్చిమ బెంగాల్‌లో 32వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ నియామకాలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 2014లో టెట్ ద్వారా టీచర్లుగా నియమితులైన అందరూ అక్రమంగా ఉద్యోగాల్లో చేరినట్లు దర్యాప్తులో తేలలేదని కోర్టు పేర్కొంది. 264 మంది మాత్రమే అలా చేరారని, వీరి కోసం 32వేల మంది రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

News December 4, 2025

వచ్చే నెలలో ‘భూభారతి’.. మూడు విడతల్లో ‘భూధార్’: మంత్రి పొంగులేటి

image

TG: జనవరిలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామని, ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నామన్నారు. కొత్త సర్వే నంబర్లు, బౌండరీలు ఫిక్స్ చేసి భూధార్ కార్డులను సిద్ధం చేస్తామని చెప్పారు. మూడు విడతల్లో వీటిని అందిస్తామని పేర్కొన్నారు.