News May 3, 2024
అదే జరిగితే బీజేపీకి సింగిల్ డిజిట్ రాదు: వీకే పాండియన్

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా పేరొందిన వీకే పాండియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే సింగిల్ డిజిట్ కూడా ఆ పార్టీకి రాదన్నారు. బీజూ జనతా దళ్(BJD) విజయం భారీగా ఉండనుందని.. ఈ ఎన్నికల్లో తాము క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో జరగనున్నాయి.
Similar News
News December 10, 2025
1,384 మందితో బందోబస్తు: NZB సీపీ

బోధన్ రెవెన్యూ డివిజన్లో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. 1,384 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 10, 2025
క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.
News December 10, 2025
ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.


