News March 17, 2025
డీఎంకే లక్ష్యంగా బీజేపీ ఆందోళనలు

తమిళనాడులో డీఎంకే సర్కార్ టార్గెట్గా బీజేపీ ఆందోళనలకు దిగింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పార్టీ చీఫ్ అన్నామలై సహా కీలక నేతలు హౌస్ అరెస్టయ్యారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు రూ.1000 కోట్లు ముట్టాయని బీజేపీ ఆరోపణలకు పాల్పడుతోంది. రూపీ(₹) సింబల్ పేరుతో డీఎంకే నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Similar News
News March 17, 2025
ఉగాది నుంచి పీ4 విధానం అమలు: సీఎం చంద్రబాబు

AP: ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు అన్నారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తామని తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి APలో 2020 విజన్ వల్ల చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పారు.
News March 17, 2025
రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.
News March 17, 2025
OTTలోకి వచ్చేసిన 5 ఆస్కార్లు గెలిచిన మూవీ

5 ఆస్కార్ అవార్డులు పొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘అనోరా’ ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్స్టార్లో ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు USలో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ‘అనోరా’ ఒక లాటిన్ పదం. దీనికి తెలుగులో గౌరవం అని అర్థం.