News September 13, 2024

రైతు సమస్యలపై దీక్ష చేయాలని బీజేపీ నిర్ణయం

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో బీజేపీ దీక్ష చేపట్టనుంది. ఈనెల 20న లేదా నాలుగో వారంలో దీక్షను ప్రారంభించనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోఆర్డినేట్ చేసే బాధ్యతలను ఎంపీ లక్ష్మణ్‌కు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

Similar News

News March 24, 2026

తగ్గిన అమెరికా వీసాలు.. భారత్, చైనాపైనే ప్రభావం

image

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన రూల్స్ వల్ల అమెరికా వీసాల జారీ భారీగా తగ్గింది. భారత్, చైనా పౌరులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. గతేడాది కేవలం 2.5 లక్షల వీసాలే జారీ చేయగా శాశ్వత, తాత్కాలిక నివాస వీసాల్లో 11% తగ్గించారు. ముఖ్యంగా భారత్, చైనాలకు సంబంధించి 84 వేల వీసాలు తగ్గడంతో అక్కడికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

News March 24, 2026

ఆర్టీసీలో సమ్మె హెచ్చరికలు.. రేపు చర్చలు

image

TG: తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామని RTC JAC హెచ్చరించడంతో ప్రభుత్వం స్పందించింది. రేపు HYDలోని అంజయ్య భవన్‌లో చర్చలకు రావాలని సంస్థ ప్రతినిధులు, JAC ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థలోకి యూనియన్ల అనుమతి, 2021, 2025 జీత భత్యాల సవరణ, డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకాలు, బకాయిలను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

News March 24, 2026

కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

image

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్‌ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్‌ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.