News August 7, 2025

బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే బీజేపీ ఓటమి ఖాయం: పొన్నం

image

TG: బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో బీసీలు బీజేపీని తిరస్కరించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చావుతప్పి కన్నులొట్ట.. అన్నట్లుగా గెలిచిందన్నారు. కిషన్ రెడ్డి వంటి వారి కుట్రలను సాగనివ్వబోమని, గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News August 10, 2025

సిరాజ్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం

image

సిరాజ్‌ను కోహ్లీ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విరాట్‌పై అతనికున్న అభిమానమే అందుకు కారణం. ఇటీవల సిరాజ్ మేనేజర్ ‘BELIEVE’ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అందులో గోడకు కోహ్లీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ జెర్సీ ఫ్రేమ్ కట్టించి ఉంది. అది చూసిన విరాట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సిరాజ్-కోహ్లీ బాండింగ్‌కు ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

News August 10, 2025

చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి

image

మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులి పురుగులు ఏర్పడతాయి. 1-19 ఏళ్ల వరకు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మందులు వాడుతూ ఉండాలి. వీటివల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు10న రెండుసార్లు ‘నులి పురుగుల నివారణ దినోత్సవాలు’ నిర్వహిస్తుంది. ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తోంది.

News August 10, 2025

బంగారం కాదు.. ఇవే విలువైనవి: వారెన్ బఫెట్

image

కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దృష్టిలో బంగారానికి విలువలేదు. దాదాపు రూ.12 లక్షల కోట్ల(140 బి.డాలర్స్) ఆస్తులున్న ఆయన ఒక్క రూపాయీ బంగారంపై పెట్టలేదు. 2011లో ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా 6 నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. బంగారమా, భూమా? అంటే.. ఆయన భూమే కొనమంటారు. గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్తారు.