News February 9, 2025
సీఎం అభ్యర్థిపై బీజేపీ ఫోకస్

ఢిల్లీలో ఘన విజయం సాధించిన BJP సీఎం అభ్యర్థిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ విషయమై షా, నడ్డాతో మోదీ చర్చించారు. రేపటి నుంచి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో ఈలోపే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. అటు 1, 2 రోజుల్లో BJP పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశం కానుంది. మోదీ సూచించిన అభ్యర్థినే ఈ సమావేశంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆప్ ఓడిపోవడంతో CM ఆతిశీ కాసేపట్లో రిజైన్ చేయనున్నారు.
Similar News
News December 1, 2025
లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్‌తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్‌కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్‌పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.
News December 1, 2025
రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News December 1, 2025
అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.


