News June 6, 2024

తెలంగాణలో భవిష్యత్తు BJPదే: కిషన్‌రెడ్డి

image

TG: ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు BJPకి అండగా నిలిచారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ‘CM రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు ఆయన గతంలో MPగా గెలిచిన మల్కాజిగిరిలోనూ BJP సత్తా చాటింది. మరో 6-7 సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌కు బలమైన మెదక్‌లోనూ BJP గెలుపొందింది’ అని మీడియాతో పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు.

Similar News

News December 1, 2025

శ్రీకాకుళం జిల్లాలో 8,485 HIV కేసులు.!

image

జిల్లాలో సుమారు 8,485 HIV కేసులు ఉన్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. అందులో 3,526 మంది పురుషులు, 4,606 మంది స్త్రీలు, 23 ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆసుపత్రి, రాగోలులో ART కేంద్రాలతో పాటు ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, కోటబొమ్మాళి,నరసన్నపేట, రణస్థలం,పాతపట్నం,పొందూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ICTC కేంద్రాల ద్వారా మందులు అందిస్తున్నామన్నారు.

News December 1, 2025

‘108’ సంఖ్య విశిష్టత

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.

News December 1, 2025

SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in