News November 28, 2024
వచ్చే నెలాఖరు నాటికి బీజేపీ కొత్త చీఫ్: కిషన్ రెడ్డి

TG: డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌ను ఎన్నుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మోదీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను తిట్టడం ఆపేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News October 30, 2025
సెంచరీ భాగస్వామ్యం.. ఉత్కంఠగా మ్యాచ్

WWCలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(81*), హర్మన్ ప్రీత్(66*) అర్ధసెంచరీలు చేశారు. 59 పరుగులకే ఓపెనర్లు ఔటవ్వగా వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలోకి చేర్చారు. ప్రస్తుతం భారత్ స్కోరు 198/2. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 30, 2025
ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

ముంబై <<18151381>>కిడ్నాప్ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్‌తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్‌పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్ చనిపోయాడు.
News October 30, 2025
ఇదేందయ్యా ఇదీ.. బంగారు నగలు ధరిస్తే రూ.50వేలు ఫైన్

మన దేశంలో బంగారు ఆభరణాలు ధరించడమంటే ఇష్టపడని వారుండరు. కానీ ఉత్తరాఖండ్‌లోని జౌన్సర్-బావర్ ప్రాంతంలో ఉన్న కంధర్ గ్రామ నివాసితులు వింత నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా అసమానతలు తగ్గించేందుకు ఒంటినిండా నగలు ధరిస్తే రూ.50వేలు జరిమానా విధించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. మహిళలు సైతం దీనికి అంగీకారం తెలిపారు. శుభకార్యాల్లో చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలనే నిబంధన విధించారు.


