News October 21, 2024
రాజస్థాన్‌లో బీజేపీకి అగ్నిపరీక్ష

రాజస్థాన్‌లో 7 అసెంబ్లీ స్థానాలకు Nov 13న జరగనున్న ఉప ఎన్నికలు BJPకి అగ్నిపరీక్షలా పరిణమిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 11 సీట్లను కోల్పోయింది. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలు అధికార BJP, కాంగ్రెస్‌ల బలాన్ని ప్రదర్శించనున్నాయి. BJP అన్ని అస్త్రాలు సంధిస్తోంది. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తోంది. అలాగే కుటుంబ సభ్యులనూ బరిలో దింపుతోంది.
Similar News
News December 9, 2025
గొర్రెలను కొంటున్నారా? ఈ లక్షణాలుంటే మంద వేగంగా పెరుగుతుంది

గొర్రెలను కొనేటప్పుడు ఆడ గొర్రెల వయసు ఏడాదిన్నర, 8-10kgల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10-15kgల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు, ఆడ గొర్రెల్లో ఎలాంటి లక్షణాలుంటే మంద వేగంగా పెరుగుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 9, 2025
రేపటి నుంచి వారికి సోషల్ మీడియా నిషేధం

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు రేపటి నుంచి SMపై నిషేధం అమలులోకి రానుంది. Insta, Facebook, Tiktok, X, Youtube, Snapchat వంటి ప్లాట్‌ఫాంలు ఈ జాబితాలో ఉన్నాయి. నిషేధానికి ముందు తమ ఫొటోలు, కాంటాక్టులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని సంస్థలకు భారీ జరిమానా విధించనున్నారు. మెంటల్ హెల్త్, ఆన్‌లైన్ బుల్లీయింగ్ నివారణ కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం తెలిపింది.
News December 9, 2025
గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత(1/2)

గొర్రెల మంద పెరగాలన్నా, నాణ్యమైన పిల్ల రావాలన్నా, మందలో ప్రతీ 20-25 గొర్రెలకు మంచి విత్తన పొట్టేలును ఎంపిక చేసుకోవాలి. అది బలంగా, ఎత్తుగా ఉండాలి. చాలా మంది రైతులు తమ మందలో పుట్టిన పిల్లలను విత్తనం కోసం ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల నాణ్యమైన పిల్ల పుట్టకపోగా, బలహీనంగా, అంగవైకల్యంతో, తక్కువ బరువు, సంతానోత్పత్తికి పనికిరాకుండా ఉంటాయి. అందుకే వేరే మంద నుంచి నాణ్యమైన పొట్టేలును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.


