News February 8, 2025
ఓటర్లను ఆకర్షించిన BJP హామీలు

అన్ని రంగాలను ప్రభావితం చేసేలా BJP ప్రకటించిన మ్యానిఫెస్టో ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మహిళలకు నెలకు రూ.2,500, పేదలకు సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్, గర్భిణులకు రూ.21,000 ఇస్తామన్న BJPని ప్రజలు నమ్మారు. గిగ్ వర్కర్లతో పాటు వివిధ రంగాల్లో పని చేసే కార్మికులకు రూ.10లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీ వాసులకు ఆస్తి హక్కులు, తదితర హామీలు ఓట్లు కురిపించాయి.
Similar News
News November 28, 2025
2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: సీఎం

AP: రాజధాని అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా 6541 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 2028 మార్చికి పూర్తయ్యేలా అమరావతి పనులు సాగుతున్నాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు.
News November 28, 2025
విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.


