News March 25, 2025

ముస్లిములకు BJP రంజాన్ గిఫ్ట్: 32లక్షల కిట్స్ రెడీ

image

రంజాన్ సందర్భంగా BJP మైనారిటీ మోర్చా ‘సౌగాత్ ఈ మోదీ’ క్యాంపెయిన్ ఆరంభిస్తోంది. దేశవ్యాప్తంగా 32లక్షల పేద ముస్లిములకు పండగ కిట్లను అందించనుంది. అర్హులైన వారికి ఇవి చేరేందుకు 32వేల మోర్చా కార్యకర్తలు 32వేల మసీదులతో సమన్వయం అవుతారు. BJP ప్రెసిడెంట్ JP నడ్డా రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ఆరంభిస్తారు. వీటిలో పురుషులు, స్త్రీలకు వస్త్రాలు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు ఉంటాయి.

Similar News

News December 3, 2025

ENCOUNTER.. ఐదుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మరణించారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News December 3, 2025

‘అఖండ-3’ ఉందని హింట్ ఇచ్చిన తమన్?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈనెల 5న విడుదలవనుంది. ఈ సందర్భంగా రికార్డింగ్ స్టూడియోలో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఫైనల్ ఔట్‌పుట్‌ను వీక్షించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఎండ్ కార్డ్ ఫొటోను Xలో పంచుకున్నారు. అందులో ‘జై అఖండ’ అని ఉండటంతో ఇది పార్ట్-3 టైటిల్ అనే చర్చ మొదలైంది. ‘అఖండ-2’ ముగింపులో సీక్వెల్ కొనసాగింపుపై డైరెక్టర్ లీడ్ ఇస్తారని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News December 3, 2025

రాజ్‌నాథ్ ఆరోపణలన్నీ నిరాధారాలే: కాంగ్రెస్

image

మాజీ ప్రధాని నెహ్రూపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ నిరాధార ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చెప్పారు. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి ప్రజాధనం వినియోగించడానికి నిరాకరించిన నెహ్రూ, బాబ్రీ నిర్మాణానికి పన్నుల ద్వారా వచ్చిన నిధులు కేటాయించాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. మాస్క్‌లు, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలకు ప్రజాధనాన్ని వినియోగించకూడదని నెహ్రూ భావించేవారని ఠాగూర్ తెలిపారు.