News August 18, 2024

బీజేపీ వ్యూహం అదే..! (2/2)

image

పీసీసీ బాధ్య‌తల‌ను కాంగ్రెస్ ఎవ‌రికి అప్ప‌గిస్తే అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే యోచ‌న‌లో ఉంది! తెలంగాణ BJP అధ్య‌క్షుడి ప్ర‌క‌ట‌న విష‌యంలో జాప్యానికి ఇదే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ బీసీ, లంబాడా వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో బీజేపీ కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వ‌చ్చు అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Similar News

News January 15, 2025

KMM: మేకపోతులు కొనేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ 

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన పెనుబల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పార్థసారథిపురం గ్రామానికి చెందిన కీసర రాజు, కుంజా మహేశ్‌ కనుమ కావడంతో బైక్‌పై మేకపోతులు కొనేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 15, 2025

2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సినిమాలు ఇవే

image

ఈ ఏడాది తమ OTTలో వచ్చే కొన్ని సినిమాల పేర్లను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
☞ నాని ‘హిట్-3’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
☞ విజయ్ దేవరకొండ- డైరెక్టర్ గౌతమ్ మూవీ (VD 12)
☞ నాగచైతన్య ‘తండేల్’, సూర్య ‘రెట్రో’
☞ రవితేజ ‘మాస్ జాతర’
☞ మ్యాడ్ సినిమా సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’
☞ సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’
☞ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’
☞ పవన్ కళ్యాణ్ ‘OG’

News January 15, 2025

ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం

image

ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.