News December 17, 2024

జమిలి బిల్లుపై BJP వ్యూహం: ఓటింగ్ or జేపీసీ?

image

‘జమిలి బిల్లు’ను లోక్‌సభలో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ వ్యూహంపై ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ విప్‌లు జారీచేయడంతో చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంఖ్యా బలం, రాష్ట్ర అసెంబ్లీల మద్దతు అవసరం కావడంతో ప్రభుత్వం JPCకి పంపొచ్చని కొందరి అంచనా. అసలు బిల్లును ఎలా డ్రాఫ్ట్ చేశారో, ఏయే అంశాలను చేర్చారో తెలిస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరి వాదన. మీరేమంటారు?

Similar News

News October 17, 2025

లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న

image

మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు‌దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట ఆ పార్టీ అగ్రనేత ఆశన్న(తక్కెళ్లపల్లి వాసుదేవరావు) లొంగిపోయారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు బస్తర్ జిల్లా జగదల్‌పుర్‌లో 208 మంది మావోయిస్టులు సైతం అస్త్ర సన్యాసం చేశారు. వారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. వారి వద్ద ఉన్న 153 తుపాకులు, 11 గ్రానైడ్ లాంచర్లను అప్పగించారు.

News October 17, 2025

ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉద్యోగాలు

image

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్‌సైట్: https://www.prl.res.in/

News October 17, 2025

పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా, కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్లు, బైకులు, ఇతర వాహనాలు నడిపేవారు ఈ సమయంలో నిదానంగా వెళ్లడం మేలు. అలాగే పాటు ఫాగ్‌లైట్స్, బీమ్ హెడ్‌లైట్స్ ఉపయోగించాలని, ఓవర్‌టేక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.